Wednesday, January 22, 2025

ప్రవాస వైద్య విద్యార్థులకు షాకిచ్చిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

 

Medical students

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో రష్యా దాడుల కారణంగా అక్కడ చదువుకుంటున్న వేలాది మంది స్వదేశానికి తిరుగుపయనమయ్యారన్నది తెలిసి విషయమే. కాగా, భారత్‌కు చెందిన మెడిసిస్‌ విద్యార్థులు సైతం స్వదేశానికి తిరిగొచ్చారు. అయితే వారు ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లలేదు. మరోవైపు ఇక్కడ మెడికల్‌ కాలేజీల్లో, యూనివర్సిట్లీలో ప్రవేశాలు కల్పించాలని నిరసనలు తెలుపుతున్నారు. అటు విద్యార్థుల పేరెంట్స్‌ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్లారమెంట్స్‌ సెషన్స్‌లో భాగంగా ప్రతిపక్ష నేతలు సైతం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రం శనివారం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

స్థానిక వైద్య కళాశాలల్లో అడ్మిషన్లపై నేషనల్ మెడికల్ కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. మెడికల్‌ కౌన్సిల్‌ చట్టం ప్రకారం విదేశాల నుంచి భారత్‌కు బదిలీ కుదరదని వివరణ ఇచ్చింది. ఈ మేరకు పార్లమెంట్‌లో కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు అడ్మిషన్స్‌ ఇవ్వడానికి ఎన్‌ఎంసీ నిబంధనలు అంగీకరించవని తెలిపారు. దీంతో విద్యార్థులకు ఊహించని విధంగా షాక్‌ తగిలింది. స్వదేశమైన భారత్‌లోనే తాము చదువుకొనేందుకు అవకాశం కల్పించాలని ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వైద్య విద్యార్ధులు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News