Wednesday, January 22, 2025

కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి
ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌రావు
వైద్య విద్యలో తెలంగాణ మరో మైలురాయి చేరుకున్నదని వ్యాఖ్య
హైదరాబాద్: కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి రావడం పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. వైద్య విద్యలో తెలంగాణ మరో మైలురాయి చేరుకున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ స్థాపించాలన్న సిఎం కెసిఆర్ లక్షంలో ఇది మరో ముందడుగు అని వ్యాఖ్యానించారు. తాజా అనుమతితో ఈ ఏడాది రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలు అనుమతులు సాధించి దేశ చరిత్రలోనే తెలంగాణ సరికొత్త చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది నుండి కొమురంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్‌లో మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. విద్యార్థులకు 900 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే, తొమ్మిదేండ్లలోనే సిఎం కెసిఆర్ మార్గనిర్ధేశంలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని, దాంతో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరిందని చెప్పారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు స్పెషాలిటీ సేవలు చేరువ అవడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య చేరువైందని మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News