Monday, January 20, 2025

నిఖత్ జరీన్‌కు నజరానా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌ను ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎమ్‌డిసి నగదు బహుమతితో సత్కరించింది. నిఖత్ జరీన్ ఎన్‌ఎమ్‌డిసి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ పసిడి పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన నిఖత్‌ను ఎన్‌ఎమ్‌డిసి సంస్థ బుధవారం ఘనంగా సన్మానించింది. అంతేగాక నిఖత్ ప్రతిభకు గుర్తింపుగా ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News