Monday, January 20, 2025

నీటి నిల్వలోనూ నెం.1

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నీటి వనరుల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలిచింది. ఈ రా ష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్లో కూడా ప్రధాన జలశయా ల్లో నీటి వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కేంద్ర జలసంఘం జాతీయ స్థాయిలో వర్షాలపై న ఐంఎండి ముందస్తు అంచనాలు, వర్షపాతం నమోదు , ప్రాజెక్టులు , రిజర్వాయర్లలో నీటి నిలువలు తదితర అం శాలపైన సర్వే నిర్వహించి నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో జలాశయాల్లో నీటినిలువలపైన పదేళ్ల గణాంకాలను ఆధారంగా చేసుకుని తాజా పరిస్థితులు వెల్లడించింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో రిజర్వాయర్లలోని నీటి ని లువల పరిస్థితులను అధ్యయనం చేసింది. అందులో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో అత్యధికంగా నీటినిలువలు ఉన్న రాష్ట్రంగా తేలింది. ఐఎండి అంచనాల మేర కు వర్షాలు కురవకపోగా, వర్షాభావ పరిస్థిలు ఉత్పన్నమైనప్పటికీ ఈ రాష్ట్రాల్లో జలవనరులు పుష్కలంగా ఉన్నట్టు గుర్తించింది. ఈ జాబితాలో మొత్తం ఐదు రాష్ట్రాలను కేం ద్ర జల గుర్తించింది. తెలంగాణ 68.3 శాతం అధికంగా నీటి ఉన్నరాష్ట్రంగా ప్రధమ స్థానంలో నిలిచింది. 146శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఉత్తరాఖండ్ 12.1శాతంతో తృతీయ స్థానంలో నిలవగా, 6.0శాతంతో హిమాచల్ ప్రదేశ్ నాలుగవ స్థానంలోనూ, నాగాలాండ్ 2.7శాతంతో ఐదవ స్థా నంలో నిలిచాయి. ఇదే జాబితాలో దేశంలోనే అత్యల్ప నీటినిలువలు ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్ మైనస్ 77.1 శాతంలో అట్టడగు స్థానంలో నిలిచింది. తమిళనా డు -మైనస్ 57.4శాతం, పశ్చిమ బెంగాల్ మైనస్ 44.3శాతంలో నిలిచాయి.
సెప్టెంబర్‌లో అధిక వర్షాలు
జూన్ నుంచి ప్రారంభమయ్యే సాగునీటి సంవత్సరంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ కురిసిన వర్షపాతం ఆధారంగా కేంద్ర జలసంఘం ఎంపిక చేసుకున్న రాష్ట్రాల్లో నీటి అధ్యయనం చేసింది. జాతీ య స్థాయిలో జూన్ నుంచి సెప్టెంబర్ రెండవ వారం వరకూ సగటున 863.7 మి.మి వర్షపాతం నమోదు కవాల్సివుంది.అయితే రెండవ వారం గడిచే సరికి 729.5 మి.మి వర్షపాతం నమోదు జరిగింది. సెప్టెంబర్ ముగిసిపోయే నాటికి మిగిలిన రెండు వారాల్లో ఇంకా 124.2 మి.మి వర్షపాతం నమోదు కావాల్సివుంది.
తెలంగాణలో 35శాతం అధిక వర్షపాతం
జాతీయ స్థాయిలో వర్షాభావ పరిస్థితుల్లో కూడా 68.3 శాతం అధికంగా నీటి నిలువలు ఉన్న రాష్ట్రంగా నిలిచిన తెలంగాణలో సెప్టెంబర్ రెండవ వారం వరకూ 35 శాతం అధిక వర్షపాతం నమోదు జరిగింది. జూన్ నుంచి సెప్టెంబర్ చివరి వరకూ 738.6మి.మి వర్షపాతం నమోదు జరగాల్సివుం ది. అయితే ఇందులో ఇప్పటివరకూ 688 .5 మి.మి నమోదు జరగాల్సివుండగా 794.1మి.మి వర్షపాతం నమోదు జరిగింది. సాధారణంతో పోలిస్తే 15 శాతం అధికవర్షం కురిసింది. జూన్‌లో 44శాతం లోటు లో ఉన్నప్పటికీ జులైలో 114శాతం వర్షపాతం నమోదయింది. ఆగస్ట్‌లో 62శాతం లోటు వర్షపాతం ఉన్నప్పటికీ తిరిగి సెప్టెంబర్‌లో ఇప్పటికే 35శాతం అధిక వర్షపాతం నమోదయింది. జాతీయస్థాయిలో వర్షపాతాన్ని పరిశీలిస్తే ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 6 వరకూ రెండు వారాల వ్యవధిలో ప్రతిరోజు నిరంతరంగా వర్షాలలోటు కొనసాగుతూ వచ్చింది. ఈ పీరియడ్‌లో ఇది 10శాతం లోటుగా నమోదయింది. ఆగస్ట్ 19,ఆగస్ట్ 23 వరకూ కేవలం రెండు రోజులు మాత్రమే మిగులు వర్షం కురిసింది. సెప్టెంబర్ 10న దేశంలో 6.61మి.మి వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News