Sunday, January 19, 2025

సర్వేలకు అందని విధంగా లోక్‌సభ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తుందని శుక్రవారం నాడు ఆ పార్టీ తెలంగాణ శాఖ చీఫ్ జి కిషన్ రెడ్డి ప్రకటించారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన బిజెపి నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ సమాన పోరాటం ఉంటుందన్నారు. తెలంగాణలో రాజకీయంగా బిజెపికి మంచి అవకాశముందని కిషన్ రెడ్డి తెలిపారు. సర్వే సంస్థలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలుంటాయని చెప్పారు.

రేపటి నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు. 8 మంది బిజెపి ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారని చెప్పారు. అటు అసెంబ్లీ లాబీలో బిజెఎల్పీకి ప్రత్యేక గది కేటాయించారు. అసెంబ్లీ బయట కూడా ఛాంబర్ ఇవ్వాలని బిజెపి ఎమ్మెల్యేలు కోరారు. ఛాంబర్ కోరుతూ స్వీకర్ కు బిజెఎల్పీ వినతి పత్రం ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News