Monday, December 23, 2024

తెలంగాణలో ఏ పార్టీతో పొత్తులు పొట్టుకోం

- Advertisement -
- Advertisement -

పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తమ పార్టీయేనని, పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, అవకాశం అంతకన్నా లేనే లేదని, ఆ దిశగా తమ పార్టీలో ఆలోచన చేయలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాల సందర్భంగా పవన్ ఖేరా ఈ విధంగా వ్యాఖ్యానించారు.

ఏ మాత్రం సందేహం లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్న సంపూర్ణ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్పష్టమైన గెలుపు వాతావరణం కనిపిస్తోందని, సొంతంగానే తగినంత సంఖ్యా బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఏ పార్టీ నుంచి సహకారం అవసరం లేదని ఆయన నొక్కి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News