Sunday, December 22, 2024

ఎన్నికల పొత్తులపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా పోటీ చేయనున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న బీఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్ర ఇటీవల పెద్దపల్లి జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా సుల్తానాబాద్‌లో జరిగిన రాజ్యాధికార యాత్రలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చురుగ్గా పాల్గొన్నారు.

అక్కడ బిఎస్ పి పార్టీ జెండా ఆవిష్కరించిన ప్రవీణ్ కుమార్ కు మహిళలు ఘనస్వాగతం పలికారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సుల్తానాబాద్‌లోని పూసల కాలనీ, పలుకుదాస్‌లను సందర్శించి, స్థానిక నివాసితులు ఎదుర్కొంటున్న  సమస్యలను తెలుసుకోవడానికి ఇంటింటికీ వెళ్లారు. తెలంగాణ ప్రజలకు పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే తొమ్మిదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాబోయో ఎన్నికల్లో బిఆర్ఎష్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News