Tuesday, September 17, 2024

కశ్మీరులో బిజెపితో పొత్తు ప్రసక్తి లేదు: మెహబూబా ముఫ్తి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలలో బిజెపితో పొత్తు ప్రసక్తి లేదని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి మంగళవారం స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత తమ పార్టీ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని ఆమె ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఏకైక లక్షంతోనే నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సి) ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఆమె విమర్శించారు. 1947 నుంచి ఆ పార్టీ అదే పని చేస్తోందని, ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి పదవుల కోసమే ఆ పార్టీ పొత్తులు కుదుర్చుకుంటుందని ఆమె ఆరోపించారు.

అజెండా కోసం తన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని, అయితే తన పార్టీ ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమని ఆమె స్పష్టం చేశారు. 2015లో బిజెపితో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మెహబూబా ప్రస్తుత ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని చెప్పారు. ఎన్‌సితో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున జమ్మూ కశ్మీరులో బుధవారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేయనుండడాన్ని స్రస్తావించగా రాహుల్ రాకను స్వాగతిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆయన ప్రచారం కోసం కశ్మీరు వస్తున్నారని, ఆ హక్కు ఆయనకు ఉందని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News