Sunday, January 12, 2025

కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకునే అవకాశంలేనే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అర్వింద్ కేజ్రీవాల్ బుధవారం మరొకసారి స్పష్టం చేశారు. రెండు పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేస్తాయనే వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ ఆ వివరణ ఇచ్చారు. ఆప్ సొంత బలంపైనే ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని కేజ్రీవాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. ‘కాంగ్రెస్‌తో ఎటువంటి పొత్తూ కుదుర్చుకునే అవకాశం లేదు’ అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అన్నారు.

70 మంది సభ్యులు ఉండే ఢిల్లీ శాసనసభకు ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకోవచ్చునని సూచిస్తూ మీడియాలో వార్తలు వచ్చిన దృష్టా కేజ్రీవాల్ ఆ విధంగా స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరే అవకాశం లేదని కేజ్రీవాల్ ఈ నెలారంభంలో కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ బుధవారం ఢిల్లీలో నిర్వహించదలచిన ‘న్యాయ్ చౌపల్’ కార్యక్రమాన్ని రద్దు చేయడం రెండు పార్టీల మధ్య పొత్తుపై ఇటీవల ఊహాగానాలకు తావు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News