Monday, December 23, 2024

బక్రీద్ పండగకు జంతువధ చేస్తే సహించేది లేదు: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో బక్రీద్‌ను పురస్కరించుకుని ముస్లింలు మేకలు, గొర్రెలు వధించి సంబురాలు చేసుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆవులు, దూడలను వధిస్తే సహించేది లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఈనెల 27వ తేదీన బక్రీద్ నేపథ్యంలో డీజీపీ అయినా చొరవ తీసుకోవాలని రాజాసింగ్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆవులు, దూడలను వధించరాదని పేర్కొన్నారు. ఇప్పటివరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చేతకాకపోతే తమకు చెప్పాలని, ఆవులు, దూడలను రక్షించుకునేందుకు తామే రంగంలోకి దిగుతామని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, డీజీపీకి చేతులెత్తి మొక్కుతున్నానని, ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొరొన్నారు. గొడవలు జరగవద్దనే ఉద్దేశ్యంతోనే తాను ఆగుతున్నానని స్పష్టంచేశారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే నా అనుచరులు రంగంలోకి దిగుతాయని, జరిగే పరిణామాలకు పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News