Sunday, February 2, 2025

మణిపూర్ హింస కేసుల్లో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్ హింసకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ( సిబిఐ) ఇప్పటివరకు ఎలాంటి అరెస్టు జరపలేదని సంబంధిత అధికారులు శుక్రవారం తెలిపారు. నిబంధనల ప్రకారం సిబిఐ గత నెల రాష్ట్ర పోలీసులనుంచి ఎఫ్‌ఐఆర్‌లు తీసుకుందని, దర్యాప్తు కొనసాగుతోందని ఆ అధికారులు చెప్పారు. తాము దర్యాప్తు జరుపుతున్న కేసులలో సున్నితమైన పరిస్థితులను దష్టిలో ఉంచుకుని సిబిఐ కేసులను తిరిగి రిజిస్టర్ చేసినప్పటికీ నెల రోజులయినా ఎఫ్‌ఐఆర్‌లను బహిర్గతం చేయలేదు.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తమకు నివేదించిన ఆరు కేసుల దర్యాప్తు కోసం సిబిఐ గత జూన్‌లో డిఐజి ర్యాంక్ అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్)ను ఏర్పాటు చేసినట్లు ఆ అధికారులు తెలిపారు. ‘ఈ ఆరు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి ఇంతవరకు సిబిఐ ఎవరినీ అరెస్టు చేయలేదు, దర్యాప్తు కొనసాగుతోంది’ అని అధికారుల్లో ఒకరు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News