Sunday, January 19, 2025

కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి జరగలేదు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కార్వాన్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఎలాంటి దాడి జరగలేదని లంగర్‌హౌస్ పోలీసులు స్పష్టం చేశారు. కార్వాన్ కాంగ్రెస్ అభ్యర్థి ఉస్మాన్ మహ్మద్ అల్ హజిరి శనివారం ప్రచారం నిర్వహిస్తుండగా ఎంఐఎం కార్యకర్తలు దాడికి యత్నించారని లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేశారు. అక్కడ ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించి అక్కడ ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారని, ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News