Friday, November 15, 2024

బోసిపోతున్న సినిమా థియేటర్లు

- Advertisement -
- Advertisement -

థర్డ్‌వేవ్ భయంతో కనిపించని సందడి
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఆదరించిన ప్రేక్షక లోకం
వారం రోజులుగా రోజుకు 40శాతం సీట్లు నిండని పరిస్దితి
మూసివేత దిశగా అడుగులేస్తున్న నిర్వహకులు
ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్న కార్మికులు

No Audience in Theaters

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన ప్రభుత్వం సినిమా థియేటర్లు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. తొమ్మిది నెలల పాటు మూసి వేసిన నిర్వహకులు వందశాతం సీట్లతో ప్రేక్షకులు ఉండేలా ఏర్పాటు చేసుకుని చిత్రాలు వేయాలని సూచనలు చేయడంతో అట్టహాసంగా ప్రారంభించారు. కానీ థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందనే ప్రచారంతో థియేటర్ల వైపు జనం రావడంలేదు. దీంతో సందడి కనిపించక బోసిపోయినట్లు పలు థియేటర్లు దర్శనమిస్తున్నారు. వైరస్ దెబ్బకు పలు విధాలు నష్టపోగా, తెరిచి మరో రకమైన నష్టాలు చవిచూస్తున్నామని నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు, శానిటైజర్ వంటివి అందుబాటులో ఉంచిన ప్రేక్షకుల ఆదరించడంలేదంటున్నారు. నగరంలో థియేటర్లపై ఆధారపడ లక్షలాదిమంది వర్కర్లు రోడ్డు పడే పరిస్దితి ఉందని కార్మికులు పేర్కొంటున్నారు. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 600 థియేటర్లు, మల్టీప్లెక్స్‌లున్నాయి. ఒక మల్టీపెక్స్‌లో 150మంది పనిచేస్తుండగా వాటిలో 3750 ఉపాధి లభిస్తుండగా, వీటిలో సగం మంది మహిళలే ఉన్నారు. 575 థియేటర్లలో ఒకదానిలో 30మంది చొప్పన 17,250 కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అన్నింటిలో కలిపి సుమారు 21వేలు మంది జీవనోపాధి పొందుతున్నారు. వీరంతా కరోనా కాలంలో అష్ట కష్టాలు ఎదుర్కొన్నారు. థియేటర్లు ప్రారంభంతో జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయని భావిస్తే జనాధరణ లేకపోవడంతో మళ్లీ పస్తులుండే రోజులు వస్తున్నాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. గత నెల 23 నుంచి 15 సింగిల్ స్క్రీన్ థియేటర్లు, 30వ తేదీన నుంచి మల్టీప్లెక్సులు, ఇతర సినిమా హాళ్లు ప్రారంభించారు. మల్టీప్లెక్స్, మాల్స్, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ పీజులు వసూలు చేయకుండా అక్కడ పాత పద్దతి కొనసాగిస్తున్న సినిమా థియేటర్ల వైపు జనం చూడటంలేదని దిల్‌షుక్‌నగర్‌కు చెందిన సినిమా హాళ్లు యాజమానాన్ని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు.
సినిమా థియేటర్ల కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి ః కార్మిక సంఘాలు
గ్రేటర్ పరిధిలోని సినిమా థియేటర్లలో పనిచేసే కార్మికులకు ఉపాధి సక్రమంగా లభించకపోవడంతో ఆర్దికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు టీచర్లు తరహాలో కరోనా సహాయం నెలకు రూ. 3వేలు, 30 కిలోల బియ్యం ఉచితంగా అందజేయాలని పేర్కొంటున్నారు.రాష్ట్ర సినిమా థియేటర్లపై ఉన్న పన్నులను తాత్కాలికంగా వాయిదా వేయాలని, లాబాల బాటలోకి రాగానే వాటిని చెల్లించే విధంగా వెసులుబాటు కల్పించాలని యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News