Wednesday, December 25, 2024

నవ్వులు పూయిస్తున్న నోబాల్…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: నో బాల్ నెట్టింట్లో వైరల్‌గా మారి నవ్వులు పూయిస్తుంది. యుఎఇ వేధికంగా ఐఎల్‌టి టి20 లీగ్‌లో ఎంఐ ఎమిరైట్స్ వర్సెస్ అబుదాబీ నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎమిరైట్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎమిరైట్స్ వేసిన నోబాల్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. బౌలింగ్ వేస్తుండగా బంతి పైకి లేచి బౌండరీ లైన్, కీపర్ మధ్య పడింది. బౌండరీ దాటటడంతో నాలుగు పరుగులతో పాటు నో బాల్ అని ఎంపైర్ ప్రకటించాడు. దీంతో సహచర ఆటగాళ్ల ముఖంలో కూడా నవ్వులు కనిపించాయి. ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకా కొంచెం దూరంలో పడి ఉంటే సిక్స్ వచ్చేందని, బౌలర్ సిక్స్ కొట్టి రికార్డు సృష్టించేవాడని కామెంట్లు పెడుతున్నారు. డైరెక్ట్ గా కీపర్ వెనుక బంతి పడిన దృశ్యం ఎప్పుడు చూడలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బౌలింగ్ బ్యాట్స్‌మెన్‌కు వేస్తున్నావా? ఫీల్డర్‌కు వేస్తున్నావా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News