Sunday, December 29, 2024

పుట్టెడు దు:ఖంలో రైతులు.. పుట్టిన రోజు వేడుకలు వద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు పుట్టెడు దు:ఖంలో ఉన్నందున ఈ నెల 8న తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు రాష్ట్రపౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి ఆర్భాటాలు చేయవద్దని అభిమానుకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

గతంలో ఎప్పడు జన్మదిన వేడుకలు చేసుకోలేదని , ఇప్పడు కూడా చేసుకోనని తెలిపారు. వీలైతే పంటలు నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు సాయం చేయాలని సూచించారు. రైతులు దు:ఖంలో ఉన్నపుడు తాను పుట్టిన రోజు సంబరాలు జరుపుకోవడం సరికాదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News