Thursday, January 23, 2025

తాటి చెట్టు నరికిన వ్యక్తిపై కేసు నమెదు

- Advertisement -
- Advertisement -

హయత్‌నగర్‌ః ప్రభుత్వం నుండి ఏలాంటి అనుమతులు లేకుండ తాటి చేట్టును నరికిన వ్యక్తిపై కేసు నమోదు చేసి సంఘటణ హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసు స్టెషన్‌లో చోటు చేసుకుంది. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం హయత్‌నగర్ ఫరిధీ సామ నగర్ సర్వేనెంబర్ 39/39లో సాహెబ్‌నగర్ కల్లు సోసైటికి చేందిన తాటి చేట్టు, పట్టాదారు నర్సింహ్మరెడ్డి ప్రభుత్వం నుండి ఏలాంటి అనుమతులు లేకుండ తాటి చేట్టు నరికి వేశారు. పిర్యాదు మేరకు సోమవారం హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు సంఘటణ స్థలానికి చేరకొని ఆరా తీశారు. చేట్టు నరకడం చట్టరిత్య నేరం కావున నర్సింహ్మరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్‌గౌడ్ తెలిపారు.

నగర శివారులలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి పోతుండడంతో భూ యజమానులు రాత్రికి రాత్రి తాటి చేట్లను నరికి వేస్తున్నట్లు తెలిపారు. చేట్లను నరకడం చట్టరిత్య నేరం అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరిత హరంలో భాగంగా తాటి చేట్లు, ఈత చేట్లను నాటి వనాలు అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు. వాటిని సంరక్షించే భాద్యత ప్రతి ఒక్కరిది. వారితో గీత వృత్తి దారుల సంఘాలు కాపాడుకొవాలని సూచించారు. కార్యక్రమంలో ఎసై హనుమంతు, సరళా, మరియు సిబ్బంది ఫయాజ్, సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News