Tuesday, January 21, 2025

ఎంఎల్ఎల కొనుగోలు కేసు… సిబిఐ విచారణకు నో చెప్పిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్ఎల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంఎల్ఎల కొనుగోలు కేసుపై సిట్ దర్యాప్తు కొనసాగించాలని హైకోర్లు తెలిపింది. తుది నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. స్టేను కొనసాగించేలా ఆదేశాలివ్వాలని ధర్మాసానాన్ని ప్రేమేందర్ రెడ్డి కోరారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రేమేందర్ రెడ్డి కోరారు. ఎంఎల్ఎల కొనుగోలు కేసును సిబిఐ విచారణకు హైకోర్టు అనుమతించలేదు. సిట్ చీఫ్ సివి ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29న నివేదికను కోర్టుకు సమర్పించాలని సిట్ కు ఆదేశాలు జారీ చేసింది. విచారణ వివరాలను మీడియా, రాజకీయ నాయకులకు వెల్లడించొద్దని సిట్ కు హైకోర్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News