Monday, December 23, 2024

జనసేనకు ఆదిలోనే తొలి ఎదురుదెబ్బ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కూటమిగా గెలిచిన తరువాత జనసేనకు ఆదిలోనే తొలి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి. పవన్ గురించి ప్రశంసలు గుప్పించారు. పవన్‌ను ఇష్టపడే ప్రధాని జనసేనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు, అసలు అడ్డు పడిందెవరు? అనే దానిపై చర్చ మొదలైంది. కొలువు తీరుతున్న ప్రభుత్వం కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువుదీర నుంది.

ఎపి నుంచి టిడిపికి రెండు మంత్రి పదవులు దక్కాయి. బిజెపి నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలకు భాగ స్వామ్యం కల్పించారు. కానీ, ఎపిలో ఎన్డీఏ కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కల్యాణ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. టిడిపి నుంచి చంద్రబాబు సూచించిన ఇద్దరూ కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. బిజెపి నుంచి పార్టీ కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో పురందేశ్వరి పేరు ప్రచారం జరిగినా చివరకు నర్సాపురం ఎంపి శ్రీనివాస వర్మకు అవకాశం కల్పించారు. ఇక..జనసేన నుంచి ఇద్దరు ఎంపిలు గెలుపొందారు.

మిత్రపక్షాలకు అవకాశం ఇచ్చే క్రమంలో అయిదుగురు కంటే తక్కువ ఎంపిలు ఉన్న పార్టీల్లో ఒకరికి సహాయ మంత్రి హోదాతో మంత్రి పదవి ఇవ్వాలని ఎన్డీఏలో నిర్ణయించారు. అదే విధంగా మంత్రి పదవుల కేటాయింపు జరిగింది. టిడిపికి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కింది. జనసేన నుంచి బాలశౌరి పేరు చివరి వరకు ప్రచారం సాగింది. అయితే ఎంపిక లిస్టులో మాత్రం జనసేన ఎంపిల పేర్లు కనిపించ లేదు. అసలు కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు పవన్ ముందుకు రాలేదా? ఎవరి పేరు సూచించలేదా? లేక ఏం జరిగింది? అనేది ఇప్పుడు జనసేనలో ఆసక్తి కర చర్చకు కారణంగా మారుతోంది. కేడర్‌లో అసంతృప్తి కనిపిస్తోంది.

ఎపిలో ఎన్డీఏ విజయంలో పవన్‌దే కీలక పాత్ర అంటూ ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ అభినందించారు. పవన్ అంటే సునామీ అంటూ ప్రశంసించారు. కానీ, ఇప్పుడు జనసేనకు అవకాశం ఇవ్వ లేదు. దీని వెనుక చంద్రబాబు ద్వారా విస్తరణ సమయం వరకు వేచి చూడాలని పవన్‌ను ఒప్పించారనే వాదన పార్టీలో వినిపిస్తోంది. టిడిపికి రెండు పదవుల్లో ఒకటి జనసేనకు ఇచ్చి విస్తరణ సమయంలో టిడిపికి మరోకటి ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు. ఎపిలో కూటమి అధికారంలో రావటానికి, టిడిపికి తిరిగి సిఎం పదవి దక్కటానికి పవన్ ప్రధాన కారణమని అందరూ అంగీకరించే అంశం. కానీ, కేంద్ర మంత్రి పదవి విషయంలో మాత్రం జనసేనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఇప్పుడు ఎపి రాజకీయాల్లో కీలక అంశంగా మారుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News