Friday, January 24, 2025

ఇడబ్ల్యుఎస్ కోటా నిబంధనల్లో మార్పులేదు

- Advertisement -
- Advertisement -

No change in EWS quota rules:Union govt

వచ్చే ఏడాది సవరణలు చేస్తాం
నీట్‌పిజి పరీక్షలపై సుప్రీంకోర్టు అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: నీట్ పిజి పరీక్షల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఇడబ్లుఎస్) రిజర్వేషన్లు కల్పించిన విషయమై దాఖలయిన పిటిషన్ ఈ నెల 6న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ తరుణంలో కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.ఈ విద్యా సంవత్సరానికి ఇడబ్లుఎస్ కోటాలో పేర్కొన్న వార్షికాదాయం పరిమితిని రూ.8 లక్షలుగానే ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు కొనసాగుతున్న తరుణంలో నిబంధనలు మార్చడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపింది. వచ్చే ఏడాది సవరణలు చేస్తామని పేర్కొంది. ఈ వివాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిఫార్సులను అంగీకరిస్తున్నామని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. అఫిడవిట్ సిఫార్సుల ప్రకారం ..రిజర్వేషన్లు పొందడానికి వార్షికాదాయం రూ.8 లక్షలుగానే కొనసాగనుంది. ఐదు ఎకరాలకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రం ఇడబ్లుఎస్ రిజర్వేషన్ వర్తించదు. అయితే ఈ సిఫార్సులు ప్రస్తుతం కొనసాగుతున్న అడిషన్ల ప్రక్రియను మాత్రం ప్రభావితం చేయబోవని కమిటీ స్పష్టం చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపింది.

రూ.8 లక్షల పరిమితిని సమర్థించుకున్న కేంద్రం

నీట్‌పిజి పరీక్షలో ్లఇడబ్లుఎస్ రిజర్వేషన్ కోసం విధించిన రూ.8 లక్షల వార్షికాదాయం పరిమితిని కేంద్రం సమర్థించుకుంది. దీనివల్ల ఇప్పటివరకు లబ్ధిపొందిన విద్యార్థుల పూర్వాపరాలను కమిటీ పరిశీలించిందని అఫిడవిట్‌లో తెలిపింది. అర్హత లేని వారికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయన్న సమస్య ఉత్పన్నం కావడం లేదని తెలిపింది.ప్రస్తుతం ఈ నిబంధన వల్ల లబ్ధిపొందుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారేనని కూడా పేర్కొంది. అయితే ఆదాయంలో హెచ్చుతగ్గులు, కుటుంబ సభ్యుల సంఖ్య, కొన్ని ప్రాంతాల్లో జీవన ఖర్చులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిమితిని మరికొంత పెంచామని కేంద్రం తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News