Wednesday, January 22, 2025

వడ్డీరేట్లలో మార్పులు లేవు: ఆర్‌బిఐ

- Advertisement -
- Advertisement -

ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తామని తెలిపింది. ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధానాన్ని సమీక్షించింది. కీలక వడ్డీ రేట్లలో మార్పులేదని ఆర్‌బిఐ వెల్లడించింది. రేపోరేటు యథాతథం 6.5 శాతంగా ఉంచామని పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గినందుకు వడ్డీ రేట్లు పెంచడంలేదని వివరించింది. గత ఏప్రిల్ నెలలోను రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకుండా అలానే ఉంచింది. 2022 మే నుంచి వరుసగా రెపోరేటును 250 బేసిష్ పాయింట్ల మేర ఆర్‌బిఐ పెంచిన విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం కనిష్టంగా 4.7 శాతానికి దిగిరావడంతో వడ్డీ రేట్లను పెంచకుండా అలానే ఉంచింది.

Also Read: ప్రజ్ఞాసింగ్‌తో కేరళ స్టోరీ చూసిన బాలిక ముస్లిం యువకుడితో పరారీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News