Sunday, January 19, 2025

వడ్డీరేట్లలో మార్పులు లేవు: ఆర్‌బిఐ

- Advertisement -
- Advertisement -

ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తామని తెలిపింది. ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధానాన్ని సమీక్షించింది. కీలక వడ్డీ రేట్లలో మార్పులేదని ఆర్‌బిఐ వెల్లడించింది. రేపోరేటు యథాతథం 6.5 శాతంగా ఉంచామని పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గినందుకు వడ్డీ రేట్లు పెంచడంలేదని వివరించింది. 2023 ఫిబ్రవరి నుంచి ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది పదో సారి కావడం గమనార్హం. 2024-25 జిడిపి వృద్ధి రేటు 7.2 శాతంగా ఉందని, రెండో త్రైమాసికంలో 7 శాతం, మూడు, నాలుగో త్రైమాసికంలో 7.4 శాతంగా ఉందని వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో 7.3 శాతంగా వృద్ధి రేటు ఉంటుందని అంచనాకు వచ్చారు.

ఆర్థిక రంగం సిర్థంగా ఉండడంతో పాటు బ్యాంకుల కార్యకలాపాలు బలంగా ఉన్నాయని వివరణ ఇచ్చింది. మెరుగైన వర్షపాతం నమోదుతో పాటు సరిపడా నిల్వలు ఉండడంతో ఈ సంవత్సరం చివర వరకు ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని తెలిపింది. తయారీ ఖర్చులు తగ్గడం, ప్రభుత్వ విధానాలు, దేశీయంగా పెరుగుతున్న డిమాండ్ తదితర కారణాలతో తయారీ రంగం వృద్ధి చెందుతోందన్నారు. సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరగొచ్చని అంచనా వేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. యుపిఐ లైట్ వాలెట్ పరిమితి రూ.2000 నుంచి ఐదు వేలకు పెంచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News