Monday, December 23, 2024

పార్లమెంటు ఎన్నికల వరకు పిసిసి చీఫ్ మార్పు ఉండదు : మధు యాష్కీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు తెలంగాణ పిసిసి చీఫ్ మార్పు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరతకు ఎలాంటి ఢోకా లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్‌ను వీడేందుకు చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారని అయితే వారిని తమ పార్టీలోకి తీసుకునేందుకు తామే ఆలోచిస్తున్నామని మధుయాష్కీ అన్నారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.

సంక్షేమ పథకాల పేరుతో జరిగిన అవినీతిని వదలిపెట్టేది లేదని ఎవరినీ విడిచిపెట్టమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే మంత్రులు, అధికారులు అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకున్నారని, ఇక మిగిలించి బిఆర్‌ఎస్ నేతల చిట్టా బయటకు చెప్పడమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తే వందల కోట్లు బయటకు వస్తాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మధు యాష్కీ గౌడ్ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. బిఆర్‌ఎస్ అభ్యర్థి దేవీరెడ్డి సుధీర్ రెడ్డి చేతిలో ఓటమి చెందిన ఆయన మొన్నటివరకు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు దూకుడు పెంచారు. బిఆర్‌ఎస్ నేతల విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News