Thursday, December 19, 2024

వడ్డీరేట్లలో మార్పులు లేకపోవచ్చు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈసారి కూడా కీలక వడ్డీరేట్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. వరుసగా మూడో సారి కూడా వడ్డీరేట్లపై యధాతథ స్థితిని కొనసాగించవచ్చునని వెల్లడైంది. ఆగస్టు 8 10 తేదీలలో ఆర్‌బిఐ గవర్నర్ సారధ్యపు ఆరుగురు సభ్యుల ద్రవ్యవిధాన కమిటీ (ఎంపిసి) ద్వైమాసిక సమావేశం జరుగనుంది. అన్ని విషయాలను పరిశీలించుకుని ద్రవ్య విధాన నిర్ణయాలను కేంద్ర బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అధికారికంగా వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను యధాతథంగా ఉంచుతారని సంకేతాలు వెలువడ్డాయి. ఓ వైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌లు తమ వడ్డీరేట్లను పెంచినా ఇక్కడ ఈ ఈ పెంపుదలకు దిగబోరని వెల్లడైంది. దేశంలో ద్రవ్యోల్బణ స్థాయి అదుపులోనే ఉందని నిర్థారించుకుని,

ఇది చేటుకల్గించేలా లేదని తేల్చుకున్న తరువాతనే వడ్డీరేట్లలో మార్పులకు దిగబోరని ఆర్థిక ద్రవ్య వ్యవహారాల నిపుణులు తెలిపారు. గత ఏడాది మేలో పెరుగుతూ వచ్చిన రుణాల భారం తరువాతి క్రమంలో చక్కదిద్దుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్‌బిఐ రెపోరేటును 6.5 శాతంగా ఉంచుతూ వచ్చింది. ఇప్పుడు ద్రవ్యోల్భణ స్థాయి 5 శాతం కన్నా తక్కువగా ఉందని, వచ్చే కొద్ది నెలల్లో కూరగాయలు, పప్పులు ఇతర ధాన్యాల ధరలు పెరుగుతూ పోవడం వల్ల ఈ స్థాయిలో హెచ్చుదల ఉండవచ్చునని, ఈ దశలో వడ్డీరేట్లలో మార్పులు లేకపోవచ్చునని భావిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నావిస్ తెలిపారు. ఇప్పుడు ద్రవ్యపరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ గృహ సంబంధిత ఖర్చులతో తలెత్తే పర్యవసనాలు, ప్రత్యేకించి ప్రపంచస్థాయి పరిణామాలు ప్రధాన పాత్ర వహించే అవకాశం ఉందని మరో ఆర్థికవేత్త తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News