- Advertisement -
ఢిల్లీ: వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై పలువురు ఎంపిలు ఉభయ సభల్లో అడిగిన ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రైతు సంఘాలతో పదకొండు సార్లు చర్చలు జరిపామని వెల్లడించింది. ఆందోళన చేస్తున్నవారిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు వెనక్కి వెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరణించిన రైతు కుటుంబాలకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వలేదని పేర్కొంది. ప్రస్తుతం మూడు వ్యవసాయ చట్టాల అమలును సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసిందని కేంద్రం స్పష్టం చేసింది.
- Advertisement -