Monday, January 20, 2025

మంథని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం

- Advertisement -
- Advertisement -

మంథని : పెద్దపల్లి జిల్లా, మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్‌పై శుక్రవారం పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాసంలో తొమ్మిది మంది కౌన్సిలర్లు పాల్గ్గొనడంతో చైర్మన్, వైస్ చైర్మన్ వారి పదవులు కోల్పోయారు. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జడ్‌పి చైర్మన్ పుట్ట మధు అంతా తానై బిఆర్‌ఎస్ కౌన్సిలర్లను 11 మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. మున్సిపల్ పీఠం జనరల్ మహిళ కావడంతో మోజార్టీ సభ్యులు పుట్ట మధు సతీమణి పుట్ట శైలజను చైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోగా, వైస్ చైర్మన్‌ను ఎస్‌సి సామాజిక వర్గానికి చెందిన ఆరెపల్లి కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎంఎల్‌ఎగా శ్రీధర్‌బాబు గెలుపొంది రాష్ట్రంలో ఉన్నతమైన మంత్రి పదవిలో

ఉండటంతో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మంథని మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లపై 9 మంది కౌన్సిలర్లు సంతకాలతో కూడిన అవిశ్వాస నోటీసును ఈనెల 1న జిల్లా అదనపు కలెక్టర్‌కు అందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్‌డిఓ హనుమానాయక్ అధ్యక్షతన శుక్రవారం మున్సిపల్ ప్రత్యేక సమావేశం 11 గంటలకు నిర్వహించారు. సభ్యులు ఇచ్చిన అవిశ్వాసం నోటీసుకు అనుకూలంగా 9 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. దీంతో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లు పదవులు కోల్పోయినట్టు ఆర్‌డిఓ ప్రకటించారు. అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు ఎత్తిన వారిలో గుండ విజయలక్ష్మి, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర, వడ్లకొండ రవి, శ్రీపతి బానయ్య,పెండ్రు రమ, వేముల లక్ష్మి, చొప్పకట్ల హనుమంతు, కొట్టె పద్మ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News