Monday, December 23, 2024

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం?

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం?….. విపక్షాల నిర్ణయం

న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై ప్రధానిర్రేఏంద్ర మోడీ ప్రసంగించేలా చేసే ప్రయత్నంలో భాగంగా లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని 26 పార్టీలతో కూడిన ప్రతిపక్ష కూటమి‘ ఇండియా’ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం జరిగిన విపక్షాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రసంగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి ఉన్న మార్గాలపై ప్రతిపక్షాలు ఈ సమావేశంలో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

ఈ అంశంపై చర్చ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి అవిశ్వాస తీర్మానాన్ని తీసుకు రావడమే సరయిన మార్గమని అన్ని పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయని ఆ వర్గాలు తెలిపాయి. మణిపూర్ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ప్రతిపక్షాల వ్యూహం రాజ్యసభలో కూడా కొనసాగుతుందని కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపక్షాల వ్యూహం గురించి తనకు తెలియదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు.

అయితే గతంలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే బిజెపి 300 సీట్లకు పైగా మరింత బలమైన మెజారిఒటీతో అధికారంలోకి వచ్చిందని, ఈ సారి కూడా అదే జరుగుతుందని ఆయన అన్నారు. లోక్‌సభలో మోడీ ప్రభుత్వంపై తొలి అవిశ్వాసతీర్మానాన్ని 2018 జులై 20న ప్రవేశపెట్టగాఅధికార ఎన్డీఎ భారీ మెజారిటీతో విజయం సాధించింది. 325 మంది ఎంపిలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా, 126 మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. అయితే అవిశ్వాసతీర్మానం వీగిపోతుందని స్పష్టంగా తెలిసినప్పటికీ రైతుల సమస్యలు, ఆర్థికాభివృద్ధి మందగించడం, కొట్టిచంపడం లాంటి ప్రధానమైన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలకు దీనిపై చర్చ అవకాశం కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News