- Advertisement -
న్యూఢిల్లీ : మణిపూర్ విషయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ప్రతిపక్షం తన పంతం నెగ్గించుకుంది. చర్చ దశలో ప్రధాని మోడీ దీనిపై సభలో మాట్లాడాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతిపక్షం మాట మేరకు ప్రధాని మోడీ పాల్గొంటున్నందున ఇక పార్లమెంట్ సజావుగా సాగేందుకు విపక్షం సహకరించాలని అమిత్ షా కోరుతున్నారు.
అయితే ఇదే సమయంలో చర్చకు ప్రధాని సమాధానం అవసరం లేదని అధికార పక్షం స్పష్టం చేసింది. హోం మంత్రి అమిత్ షా జవాబుతో సరిపోతుందని తెలిపారు. మణిపూర్‌లోనే 1993లో కానీ, 1997లో కానీ భారీ స్థాయి ఘర్షణలు జరిగినప్పుడు పార్లమెంట్‌లో దీనిపై ఎటువంటి ప్రకటన వెలువడలేదని, కేవలం సహాయ మంత్రి దీనిపై ప్రకటన వెలువరించారని అధికార పక్షం గుర్తు చేస్తోంది.
- Advertisement -