Monday, January 20, 2025

మేయర్‌ పదవి కాపాడుకునేందుకు కాంగ్రెస్ లోకి జంప్.. చివరికి…

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ పార్టీ వీడిన ఓ మేయర్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ మేయర్ పార్టీ మారితే పదవి ఉంటుందని భావించాడు. కానీ ఆ కిస్మత్ సహకరించలేదు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మేయర్‌ మహేందర్ గౌడ్ అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాడు. గురువారం రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి సమక్షంలో ఈ ఓటింగ్ జరిగింది. అవిశ్వాస తీర్మానంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఓటింగ్ లో మేయర్ మహేందర్ గౌడ్ దిమ్మతిరిగే షాకిచ్చారు కార్కొరేటర్లు. మహేందర్ రెడ్డికి వ్యతిరేకింగా 16 మంది కార్పొరేటర్లు ఓట్లు వేశారు. మహేందర్ గౌడ్ వర్గానికి చెందిన కార్పొరేటర్లు కౌంటింగ్ డుమ్మ కొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News