Sunday, November 17, 2024

నేను నిర్దోషిని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకూ ఎలాంటి సంబంధం లేదని, తాను పూర్తిగా నిర్దోషినని ఎంఎల్‌సి కవిత సో మవారం ఇడి అధికారులకు మరోసారి స్పష్టం చేసినట్లు తెలిసింది. తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారం లేకున్నా కేవలం రాజకీయ కుట్రతోనే వరుసగా విచారణల పేరిట వేధిస్తున్నారని ఆమె నేరుగా ఇడి అధికారుల కు తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసిం ది. సోమవారం ఉదయం 11 గంటలకు ఇడి ఎదుట విచారణకు హాజరైన కవిత పూర్తి వి శ్వాసంతో, స్థైర్యంతో విచారణను ఎదుర్కొన్న ట్లు విశ్వసనీయంగా తెలిసింది. బయట ప్రచా రం జరిగినట్లుగా ఇతర నిందితులతో ఉమ్మడిగాకాకుండా కవిత ఒక్కరినే సుదీర్ఘంగా విచారించినట్లు తెలిసింది. ఇడి ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం ఉదయం చెప్పిన సమయానికే విచారణ కార్యాలయానికి వెళ్ళినా గంటసేపటి వరకు విచారణాధికారులు కా ర్యాలయానికి చేరుకోలేదు.

ఇది మానసిక హింసకాక మరేమిటని ఆమె అధికారుల తీరు పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వి చారణ సోమవారం సుదీర్ఘంగా 11 గం. పాటు కొనసాగినా విచారణ జరిగిన తీరు పూర్తిగా రాజకీయ ఒత్తిడిలో భాగంగానే జరిగినట్లుగా కవిత సన్నిహితులు చెబుతున్నా రు. విచారణకు కవిత పూర్తి స్థాయిలో సహకరిస్తున్నా స హాయ నిరాకరణగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కవి త వర్గీయులు వివరించారు. తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటానని ఆమె ఇడి అధికారులతో విచారణ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పినట్లు తెలిసింది. విచారణ సందర్భంగా తాను చెప్పే ప్రతి అంశాన్నీ ఆడియో, వీడియో రికార్డు చేయాలని కవిత పట్టుబట్టి రికార్డు చేయించినట్లు తెలియవచ్చింది. మొత్తం విచారణలో 14 దాకా ప్రశ్నలను ఇడి అధికారులు సంధించినా లిక్కర్ స్కాంలో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు చూపలేకపోయారని కవిత విచారణ అనంతరం తన సన్నిహితులతో అన్నారు.

విచారణ ప్రారంభంలో కవిత తనను నిందితురాలిగా పిలిచారా అని విచారణాధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా విచారణను సుప్రీంకోర్టులో సవాలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో వుండగా ఇంత హడావిడిగా విచారించాల్సిన అవసరం ఏముందని కవిత అధికారులను నిలదీసినట్లు తెలిసింది. గత విచారణలో స్వాధీనం చేసుకొన్న తన ఫోన్‌లోని అన్ని వివరాలను చెక్ చేసుకోవచ్చని కవిత విచారణాధికారులతో స్పష్టం చేసినట్లు తెలిసింది. తాను ఖరీదైన ఫోన్లను ధ్వంసం చేసినట్లుగా మీడియాకు లీకులు ఎవరు ఇచ్చారని ఆమె విచారణ సందర్భంగా అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిసింది. బిజెపిలో చేరితే అవినీతిపరులంతా నీతిపరులవుతారా అని కూడా కొందరు బిజెపిలో చేరిన ఇతర పార్టీల నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు తెలియవచ్చింది. విచారణ మొత్తం గా పారదర్శకంగా జరగలేదని ఎవరో ఒత్తిడితో అధికారులతో విచారణ జరిపించినట్లుగా జరిగిందని ఆమె పార్టీ సీనియర్ నాయకులతో అన్నట్లుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News