Wednesday, January 22, 2025

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి జరగలేదు: రామ్మోహన్ నాయుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి జరగలేదని కేసు నిలబడదని అందరికీ తెలుసునని ఎంపి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎపి గవర్నర్‌కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశాన్ని కూడా చెప్పలేదని దుయ్యబట్టారు. అధికారులు రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ ఏ విధంగా ఉందో చూడొచ్చన్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అరెస్ట్‌తో చంద్రబాబుపై ప్రజలకు ఇంకా నమ్మకం పెరిగిందని రామ్మోహన్ తెలియజేశారు.

Also Read: చంద్రబాబు అరెస్టు వార్త విని ప్రాణాలు కోల్పోతున్నారు: నందమూరి రామకృష్ణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News