Thursday, January 23, 2025

సిపిఎస్ వద్దు… పాత పెన్షన్ ముద్దు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : సిపిఎస్ వద్దు పాత పెన్షన్ ముద్దు అని టిఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, తెలంగాణ కంట్రీబ్రుట్రీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దేవరాజు అన్నారు. శనివారం శనివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఈ నెల 16న జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌లో ప్రారంభంకానున్న పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర గోడ పత్రికను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం సాధించేందుకు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్ర చేపట్టామన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సిఎం కెసిఆర్ రాష్ట్రంలోని 1,72,000 సిపిఎస్ ఉద్యోగుల గురించి ఆలోచించాలన్నారు.

ఇప్పటికే అనేక రాష్ట్రాలలో పోరాటాలు చేసి పాత పెన్షన్ విధానాన్ని సాధించుకున్నారని అదే స్ఫూర్తితో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఏకమై పోరాటం చేసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై 27న సిద్దిపేటకు చేరుకుంటుందని ఈ సందర్భంగా నిర్వహించ తలపెట్టిన సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోతే అభినహి తో కబీనహి అన్న నినాదంతో ఆగస్టు 12న పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, తెలంగాణ స్టేట్ కంట్రీబ్రుటీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శశికుమార్, యూటిఎఫ్ ,తపాస్, పిఆర్‌టియూ, ఎస్‌జిటి, పిఈటిఎటీఎస్, డిటిఎప్,ఎస్‌టియూ, ఆర్‌పిపిటిఎస్,టిఎస్‌పిటిఎ, టిపిటిఎఫ్, రెవెన్యూ ఎంప్లాయిస్ యూనియన్, టిఎస్సి,ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ టిజిజిఎల్‌ఏ ఉద్యోగ ఉపాద్యాయ సంఘాల నాయకులు విక్రమ్ రెడ్డి, శశికుమార్, వెంకటరాజం, రంగారవు, భూపాల్, యాదగిరి, సురేశ్‌కుమార్, రవి, సతీష్, రాజిరెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, లక్ష్మణ్, శ్రీరామ్, సిద్ది వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News