Friday, April 25, 2025

ఇక పాకిస్థాన్‌తో నో క్రికెట్.. తేల్చి చెప్పేసిన బిసిసిఐ

- Advertisement -
- Advertisement -

ముంబై: పహల్‌గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడిని యావత్ దేశం ఖండించింది. ఈ దాడితో సంబంధం ఉన్న వారందరినీ శిక్షించాలని ప్రతీ ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉగ్రవాద దాడికి ప్రతిచర్యలు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) ఓ కీలక నిర్ణయం తీసకుంది. ఇకపై పాకిస్థాన్‌తో ఏ ఫార్మాట్‌లోనూ క్రికెట్ ఆడేది లేదని బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఎప్పటి నుంచి భారత్, పాకిస్థాన్‌లు మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు అడవు. కేవలం ఐసిసి నిర్వహించే టోర్నమెంట్‌లలో మాత్రమే భారత్, పాక్ తలపడతాయి. ఆ ఒక మ్యాచ్‌ కోసం అభిమానులు ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూస్తారు. అయిత ఇప్పుడు ఐసిసి టోర్నమెంట్‌లో కూడా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని బిసిసిఐ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. భారత్, పాకిస్థాన్ చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News