Thursday, December 26, 2024

యూపి పారిశ్రామిక వేత్తలకు ఇక నేరస్థుల బెదిరింపులుండవు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లో పారిశ్రామికవేత్తలకు ఇకపై నేరస్థుల నుంచి లేదా మాఫియా నుంచి ఎలాంటి బెదిరింపులు ఉండబోవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం స్పష్టం చేశారు. గ్యాంగ్‌స్టర్ అతిక్ మహ్మద్, ఆయన సోదరుడి హత్యల తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతలపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆదిత్యనాథ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. లక్నో, హర్దోయి జిల్లాలలో టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్, ఆపెరల్ ( పిఎం మిత్రా స్కీమ్ ) స్కీమ్‌లో ఒప్పందాలు కుదిరిన కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఉత్తరప్రదేశ్ అల్లర్లకు ప్రసిద్ధి చెందిందని,చాలా జిల్లాల ప్రజలు భయపడుతుంటారని, ఇప్పుడు అలాంటి భయమేమీ ఉండదని అన్నారు. ఇదివరకటి అఖిలేశ్ నేతృత్వం లోని ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ 20122017 మధ్యకాలంలో 700 అల్లర్లు జరిగాయని, అదే 20172023 మధ్య కాలం ఒక్కటైనా అల్లరి జరగలేదని , ఎక్కడా కర్ఫూ విధించలేదని , అలాంటి పరిస్థితి తిరిగి తలెత్తదని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి ఇది చాలా మంచి అవకాశమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News