Saturday, January 11, 2025

తుపానుపై వదంతులు నమ్మవద్దు: ప్రజలకు ఐఎండి సూచన

- Advertisement -
- Advertisement -

No Cyclone threat to Odisha says IMD

భువనేశ్వర్: తుపానుకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి సూచనలు అందచేయలేదని, ఈ విషయమై ఎటువంటి వదంతులను ఒడిశా ప్రజలు నమ్మవద్దని భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం బుదవారం తెలియచేసింది. తుపానుపై ఎటువంటి సూచనలు, అంచనాలను తాము ఇప్పటివరకు ప్రకటించలేదని, ప్రజలు వదంతులను నమ్మరాదంటూ భారత వాతావరణ కేంద్రానికి చెందిన ప్రాంతీయ కేంద్రం బుధవారం ట్వీట్ చేసింది. తుపాను రాకకు ఏడు రోజుల ముందుగానే వాతావరణ పరిస్థితులపైన సూచనలు, అంచనాలు తెలియచేయడం శాస్త్రీయంగా సాధ్యం కాదని కేంద్రం తెలిపింది. కచ్ఛితమైన వాతావరణ సంబంధిత సమాచారాన్ని అందచేయడానికి తాము రోజంతా పనిచేస్తున్నామని, దయచేసి వదంతులకు దూరంగా ఉండాలని ఐఎండి డైరెక్టర్ జనరల్ డి మృత్యుంజయ్ మొహపాత్ర తెలిపారు. రానున్న ఏడు రోజుల్లో ఒడిశాకు ఎటువంటి తుపాను ముప్పు లేదని ఆయన పేర్కొన్నారు.

No Cyclone threat to Odisha says IMD

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News