Monday, December 23, 2024

కోదండరాం పోటీపై ఏ నిర్ణయం జరగలేదు :టిజెఎస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుండి తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని తెలంగాణ జనసమితి (టిజెఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేష్, ధర్మార్జున్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కోదండరాం పోటీపై రాష్ట్ర కమిటీ ఏ విధమైన చర్చగానీ నిర్ణయము గానీ చేయలేదని ఆయన తెలిపారు. ఒక పత్రికలో కోదండరాం పోటీ చేయనున్నట్లు వచ్చిన వార్తకు మా పార్టీకి సంబంధం లేదని ఆయనన్నారు.

తాము రాష్ట్ర పభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఆందోళనలను నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నామని, ఇంకా ఎన్నికలు పోటీ అనే అంశంపై చర్చించలేదని వారన్నారు. పత్రికల్లో వస్తున్న వార్తలను ఆధారంగా చేసుకొని కొంతమంది పనిగట్టుకొని జనసమితి పార్టీని రాజకీయంగా బదనాం చేయడానికి అసందర్భ, అప్రస్తుత విమర్శలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజా స్వామిక శక్తులను ఐక్యం చేయాలని తెలంగాణ జన సమితి భావిస్తోందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News