Monday, December 23, 2024

విద్యాసంస్థల ప్రారంభంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు…

- Advertisement -
- Advertisement -

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

English medium for all classes in Telangana

 హైదరాబాద్: పాఠశాలలు, విద్యాసంస్థల ప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి పి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి ఐదు నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తారన్న వార్తలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సోమవారం చెప్పారు. ఈ నెల 30 వరకు మెడికల్‌ కాలేజీలు మినహా విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించామని, సెలవులను పొడిగించాలా? లేక, విద్యాసంస్థలను తెరవాలా? అన్నది 30వ తేదీనాటి కరోనా కేసుల పరిస్థితులను బట్టి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి 8 ఆపై తరగతుల విద్యార్థులందరికీ ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగుతున్నాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News