Sunday, December 22, 2024

డెంగీ కేసులు లేవు

- Advertisement -
- Advertisement -
  • టైఫాయిడ్, వైరల్ ఫీవర్ నమోదు అవుతున్నాయి
  • డెంగీ పరిసర ప్రాంతాల్లో డిఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ
  • మాధురి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కృష్ణారెడ్డి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సీజ్
  • ప్రజలకు మెరుగైన వైద్యం అందించండి
  • ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

కరకగూడెం : మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శిరీష బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కరకగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాన్ని ముందుగా పరిశీలించారు. అనంతరం ఎస్‌సి కాలనీలో డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయని పలు పత్రికలలో శీర్షికలు రావడంతో డా శిరీష, మండల వైద్య బృందంతో కాలనీని పరిశీలించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీలో ప్రతి వ్యక్తి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షించమన్నారు. గామంలో సుమారు 13 మందికి ఆర్‌డిటి టెస్ట్ నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చిందని తెలిపారు.

నంతరం గ్రామంలో పర్యటించి కాలువలో మురుగునీరు అక్కడికక్కడే నీరు నిలిచిపోవడంతో సంబంధిత పంచాయతీ కార్యదర్శికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి ఫ్రిజ్, కూలర్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ వైద్యులు పరిమితికిమించి వైద్యం చేస్తున్నారాని ఆమె దృష్టికి రావడంతో మండల కేంద్రంలోని ఆర్‌ఎంపి కేంద్రాలకు వెళ్లి పరిశీలించి రెండు కేంద్రాలను సీజ్ చేశారు. మాధురి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కృష్ణారెడ్డి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను సీజ్ చేశారు. మండలంలో ఉన్న ఆర్‌ఎంపిలకు నోటీసులు అందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గ్రామాల్లో ప్రభలుతున్న వైరల్ ఫీవర్‌ను జాగ్రత్తలు పాటిస్తే జ్వరాలు తగ్గిపోతాయని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. మురికి నీటి నిల్వలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. గ్రామాలలో పంచాయతీ అధికారులు నిత్యం ఫాగింగ్ చేయించాలని, క్లోరినేషన్ బ్లీచింగ్ చేయించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. మండలంలో గ్రామీణ వైద్యులు మితిమీరిన వైద్యం చేస్తుండడంతో వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు.

మాధురి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో విచ్చలవిడిగా రోగులను బల్లల మీద కూర్చోబెట్టి స్లైన్ బాటిల్ ఎక్కిస్తున్నారని, స్టెరాయిడ్ యాంటీబయటిక్ హైడోస్ మందులు పేషెంట్లకు అందిస్తున్నారని, వాటిని పరిశీలించి మాధురి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను సీజ్ చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు కారం మధు, పర్షియా నాయక్, లింగ్య నాయక్, గొంది వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది కృష్ణ ,నరసింహారావు, శ్రీను, భద్రమ్మ రమాదేవి ఆశ వర్కర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News