ఏడేళ్లు మంత్రిగా ఉండి హుజురాబాద్ ను ఈటెల అస్థవ్యస్థం చేశారు
పనుల్లో చొరవ చూపక పూర్తి నిర్లక్ష్యంతో రోడ్లను ఈటెల నాశనం చేశాడు
కేవలం మూడు నెలల్లోనే హుజురాబాద్ రూపురేఖలు మార్చిన ఘనత కెసిఆర్ కే దక్కుతుంది
56 కోట్లతో హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి
పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలి
హుజురాబాద్ అభివృద్ధి భాద్యత నాదే మంత్రి గంగుల
హుజారాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో అహర్నిశలు పనిచేస్తున్నామని, పల్లెలు పట్టణాలుగా మారాలని, పల్లెలు, పట్టణాలల్లో ఆధునీకరణ చెంది అభివృద్ధి జరగాలని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. శనివారం హుజురాబాద్ లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడారు. గతంలో కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్ని మారినా మున్సిపాలిటీలకు, స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇవ్వలేదని, ఇళ్లు కట్టుకున్న యాబై ఏళ్ల తర్వాత కూడా మట్టి రోడ్డే ఇంటి ముందు ఉండేదని, సమైక్య పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంగా సిద్దించాక కెసిఆర్ సంకల్పంతో మున్సిపాలిటీ, స్థానిక సంస్థల నిధులతో సంబందం లేకుండా అభివృద్ధి కోసం ప్రభుత్వమే నేరుగా నిధుల్ని అందిస్తోందని తెలియజేశారు. ప్రప్రథమంగా వివిద రకాలుగా స్పెషల్ డెవలప్మెంట్ నిధుల్ని అందించి రాష్ట్రవ్యాప్తంగా డెవలప్ చేస్తున్నామని గంగుల వివరించారు.
అన్ని మున్సిపాలిటీలు ఈవిదంగా అభివృద్ధితో దూసుకుపోతుంటే హుజురాబాద్ లో ఈటెల నిర్లక్ష్యంతో గతంలో ఉన్న రోడ్లు పూర్తిగా పాడైపోయాయని, మున్సిపాలిటీగా మారినా అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. నిధులు రాబట్టలేకపోవడం, ఉన్న నిధుల్ని సైతం సరిగా ఖర్చు పెట్టకపోవడంతో మున్సిపాలిటీలో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రులే అన్ని డిపార్మెంట్లను సమన్వయం చేసుకొని అభివృద్ధి చేసుకోవాలని, ఏడేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈటెల అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ఈ దుస్థితిని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకపోవడంతో తక్షణమే స్పందించి రూ. 35 కోట్ల రూపాయల్ని కేటాయించారని, వీటిలో 25 కోట్ల రూపాయల్ని కేవలం డ్రైన్లు, రోడ్లకే కేటాయించారని గంగుల గుర్తు చేశారు. 140 రోడ్లను అభివృద్ధి చేయడమే కాకుండా మిగతా 100 రోడ్లను ప్రస్థుతం అభివృద్ధి చేయాలని నిర్ణయించి పనులు ప్రారంభించామన్నారు.
10 కోట్లతో పైప్ లైన్ పనులు చేశఆమని, మరిన్ని పనులు పెండింగ్ లో ఉండడంతో మరోసారి కెసిఆర్ తో మాట్లాడి మరో 15కోట్లను విడుదల చేశామన్నారు. వీటితో మరో 150 రోడ్లను, బోర్నపల్లి ఇతర అవుట్ స్కర్ట్ రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వాహన రాకపోకలకు ఇబ్బందులు ఉంటాయని అసలు వీటిని ఈటెల ఎలా విస్మరించారని దుయ్యబట్టారు గంగుల. ప్రస్తుతం అభివృద్ధి 6కోట్లతో నిధులు ఇవ్వడమే కాకుండా టెండర్లు పూర్తి చేసి అతి త్వరలోనే ఈ రోడ్డుని పూర్తి చేస్తామన్నారు. కరీంనగర్ మాదిరిగా ఇరువైపుల పుట్ పాత్ లతో రోడ్డును ఆధునీకరిస్తామన్నారు. మరో నెలరోజుల్లోనే ఈ పనులన్నీ పూర్తయి హుజురాబాద్ అత్యధ్బుతంగా అభివృద్ధి అవుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి నిర్లక్ష్యంతో వెనుకబడ్డ హుజురాబాద్ లో సైతం నిర్వహించడం ఆనందంగా ఉందని గంగుల తెలియజేశారు. మూడునెల్లలోనే ఈ మార్పులకు కారణమైన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దన్యవాదాలు తెలపారు. ఇంతటి అభివృద్ధికి కారణమైన ప్రభుత్వానికి, సిఎం కెసిఆర్ కు అందరూ అండగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక-శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ కొలిపాక నిర్మల, మున్సిపల్ కౌన్సిలర్లు, కమిషనర్ వెంకన్న, ఇతర ప్రజాప్రతినిదులు, ఆర్ అండ్ బి, ప్రభుత్వ అదికారులు పాల్గొన్నారు.