- Advertisement -
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. రెండు మూడు రోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతోంది. దీంతో భక్తులు ఎక్కువసేపు క్యూలైన్ లో వేచిచూడాల్సిన అవసరం లేకుండా దర్శించుకుంటున్నారు.
ఇక, బుధవారం కూడా తక్కువ సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా భక్తులు నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మంగళవారం శ్రీవారిని 64,359 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 20,711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -