Monday, December 23, 2024

విభజన రాజకీయాలు వద్దు… విధానాలు కావాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR counters Nirmala Sitharaman's comments

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనడంపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. 74 సంవత్సరాల క్రితం దివంగత కేంద్ర హోంశాఖ మంత్రి వల్లబాయ్ పటేల్ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత దేశంలో విలీనం చేసి సమైక్యతను చాటారని ప్రశంసించారు. ఇప్పుడున్న కేంద్ర హోంశాఖ మత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను విభజించి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అందుకే దేశంలో విభజన రాజకీయాలు వద్దని, నిర్ణయాత్మక విధానాలు కావాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News