- Advertisement -
హైదరాబాద్: మహా నగరంలో ఎక్కడా నీళ్ళ సమస్య రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో త్రాగునీటి సమస్య వస్తుంది అనే తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. జిహెచ్ఎంసి సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. వచ్చే సమ్మర్ లో గ్రేటర్ ప్రజలకు నీటి సమస్య లేదని, ఆరు జోన్ల వారిగా సమావేశాలు పెట్టీ ప్రజలకు సమస్య లేదని తెలియజేయాలని, ప్రతీ రోజు రిపోర్ట్ తీసుకోవాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్లానింగ్ ప్రకారం యధావిధిగా నీళ్ళు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ సూచించారు. వాటర్ వర్క్స్ లో ఎదైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వచ్చే పండుగలు, ఇతర కార్యక్రమాలకు సైతం నీళ్ళ సమస్య లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు పొన్నం ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -