Monday, November 18, 2024

అధికారుల నిర్లక్ష్యంతో కాగితాలకే పరిమితమైన డ్రై పోర్టు

- Advertisement -
- Advertisement -

మన తెలగాణ / హైదరాబాద్: అధికారులు నిర్లక్షంగా కారణంగా తెలంగాణలో ఏర్పాటు కావాల్సిన డ్రై పోర్టును కాగితాలకే పరిమితమైంది. సముద్ర తీర ప్రాంతం లేని తెలంగాణలోనూ సరుకు రవాణాకు కోసం అపారమైన అవకాశాలను కల్పించాలనే లక్షానిన అధికారులు నీరుకారుస్తున్నారు. సరుకు రవాణా, నిల్వ కోసం ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పటికే కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు, కృష్ణపట్నం పోర్టు, బందరులో భారీగా స్థాయిలో పోర్టులను ఏర్పాటు చేశాయి. అదే తెలంగాణలో ఏ డ్రై పోర్టు ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర విభజన సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రాష్ట్రం సముద్ర తీర ప్రాంతం లేనిది కావడంతో ఇక్కడ సరుకు రవాణాకు అనువుగా డ్రై పోర్టుల ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపింది.

Also Read: అక్కడ స్రైమరీ స్కూళ్లలో బైబిల్‌పై నిషేధం

ఈ డ్రై పోర్టులు రాష్ట్ర ఆర్థిక అభివృద్దిని మరింతగా పెంచుతాయని, ఇప్పటికే టిఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొత్త పరిశ్రమలు రావడం, వాటి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డ్రై పోర్టుల ఏర్పాటు మరో వైపు పారిశ్రామిక వర్గాలు, తయారీ దారులనూ ఊరించాయి. తెలంగాణ నుండి తమ ఉత్పత్తులను నేరుగా ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు వీలు కల్గుతుందని భావించాయి. ఇది ఒక రకంగా డబ్బు ఖర్చును తగ్గించడమే కాకుండా సమయాన్ని ఆదా చేసినట్లు అయ్యేదంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఉత్పత్తి అవుతున్న వివిధ సరుకులను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు , లేదా ముడి సరుకులను దిగమతి చేసుకునేందుకు దేశంలోని ఇతర సముద్ర తీర ప్రాంత పోర్టులను ఆశ్రయిస్తున్నారు.

డ్రై పోర్టుల ఏర్పాటు కోసం తయారు చేస్తున్న రిక్వెస్ట్ ఫర్ ప్రపోసల్ ( ఆర్ ఎఫ్ పి ) డాక్యుమెంట్‌కు త్వరలోనే ఫైనల్ టచ్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో డ్రై పోర్టు ఏర్పాటు చేయడానికి సుమారుగా రూ. 4000 కోట్ల పైచిలుకు వ్యయం కావచ్చని చెబుతున్నారు. రాష్ట్రంలో కనీసం రెండు చోట్ల డ్రైపోర్టుల ఆవశ్యకతను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఎక్కడ ఏర్పాటు చేయవచ్చన్న దానిపై అధ్యయనం చేయమని ప్రభుత్వం ఆదేశించగా నాల్గు ప్రాంతాలను టిఎస్‌ఐఐసి గుర్తించింది. వీటిలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నల్లగొండ జిల్లా దామరచర్ల ,భువనగిరి, -చౌటుప్పల్- చిట్యాల బెల్ట్, అలాగే ప్రతిపాదిత జహీరాబాద్ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మేనిఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ప్రాంతం ఇందులో ఉన్నట్లు చెబుతున్నారు. రెండు డ్రై పోర్టు పనులను తొలి దశ కింద భువనగిరి-చౌటుప్పల్-చిట్యాల బెల్ట్‌లోనూ, అలాగే జహీరాబాద్ ప్రాంతంలోనూ చేపట్టాలని భావిస్తోందన్నారు. డ్రై పోర్టుల ఏర్పాటులో రైల్వే లైన్ కనెక్టివిటీ కూడా చాలా కీలకమన్నారు. ఇప్పటికే ఉన్న రైల్వే లైన్ నుండి డ్రై పోర్టు ఉండే ప్రాంతం వరకు కూడా ప్రత్యేక లైన్‌ను ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఇందుకోసం కూడా కొంత మేరకు భూసేకరణ అనివార్యం కావచ్చనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News