Thursday, January 23, 2025

బందీలను విడిచిపెట్టేవరకు గాజాకు అన్ని సరఫరాలు బంద్: ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: బందీలను హమాస్ ఉగ్రవాదులు విడిచిపెట్టేవరకు గాజాకు విద్యుత్, ఇంధనం, మంచినీరు సరఫరా చేసే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ ఇంధన శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ గురువారం ప్రకటించారు.

ఇజ్రాయలీ బందీలు తమ ఇళ్లకు తిరిగివచ్చేవరకు వరకు గాజాలో కరెంట్ స్విచ్ నొక్కే అవకాశం లేదు, మంచినీటి నల్లాలు తిప్పే అవసరం రాదు, ఏ ఇంధనం ట్రక్కు అక్కడకు ప్రవేశించదు అంటూ ఎక్స్‌లో రాసిన పోస్టులో ఇజ్రాయెల్ మంత్రి స్పష్టం చేశారు. మానవత్వానికి ప్రతిగా మానవత్వం ఉంటుంది..మాకు ఎవరూ నీతులు చెప్పనక్కర్లేదు అంటూ ఆయన ఘాటుగా జవాబిచ్చారు.

ఇజ్రాయెలీ అధికారులు తెలిపిన ప్రకారం అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు దాదాపు 150 మంది ఇజ్రాయెలీలను గాజాలో బందీలుగా చేసుకున్నారు. ఇందుకు ప్రతీకారంగా గాజాను దిగ్బంధిస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ సోమవారం ప్రకటించారు. గాజాకు విద్యుత్, ఆహారం, మంచినీరు, ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇంధన కొరత కారణంగా గాజాలోని ఏకైక విద్యుత్ స్టేషన్ బుధవారం నుంచి పనిచేయడం ఆగిపోయింది. దీంతో హమాస్ అధీనంలో ఉన్న గాజాలోని ఆసుపత్రులలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్లు కూడా ఇంధన కొరత కారణంగా పనిచేయడం నిలిచిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆసుపత్రులన్నీ మార్చురీలుగా మారతాయని రెండ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ గురువారం హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News