Wednesday, January 22, 2025

సాగర్ డ్యాంపై టెన్షన్ టెన్షన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇష్యూతో ఒక్కసారిగా తెలంగాణ, ఎపిల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బుధవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ పోలీసులు, ఎపి పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం విదితమే. అయితే ఓ వైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా ఎపి అధికారులు సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధం కావడం కలకలం రేపింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎపి బోర్డర్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. నాగార్జున సాగర్, మాచర్ల దారిలో తెలం గాణ నుంచి ఎపి వైపు వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఎపి అడ్రస్ ఆధార్ కార్డు కలిగి ఉన్న వారిని మాత్రమే పోలీసులు అను మతిస్తున్నారు. మిగిలిన వారిని ఎపి పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల వేళ నాగార్జునసాగర్ వద్ద బుధవారం రాత్రి హైటెన్షన్ చోటు చేసుకున్న విషయం విదితమే. ఎపికి చెందిన 500 మంది పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 26 గేట్లలో సగభాగం అంటే 13వ గేటు వరకు తమ పరిధిలోకి వస్తుందని ఎపి పోలీసులు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. వెంటనే టిఎస్‌పిఎఫ్ సిబ్బంది ఎపి పోలీసులు అడ్డు కోగా స్వల ఘర్షణ చోటు చేసుకుంది. ఎపి నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురువారం ఇదే అంశంపై ఓ ట్వీట్ చేశారు. ‘తాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కి నేడు నీరు విడుదల చేయ నున్నాము!’ అంటూ సంచలన కామెంట్ పెట్టారు. అయితే ఇరు రాష్ట్రా ల మధ్య వివాదాన్ని మరింత పెంచేలా అంబటి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్ అయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News