అవివాహితులకు గదులు
ఇచ్చేది లేదు
ఓయో కొత్త నిబంధనలు
తొలుత మీరట్‌లో అమలు
న్యూఢిల్లీ ! మీరు దంపతులేనా.. మీరు ఓయో హొటల్ హెరిటేజ్ హోమ్ లో వసతి తీసుకోవాలనుకుంటున్నారా.. అలా అయితే మీరు దంపతులేనని రుజువు చేసుకోవాల్సిందే. ఓయో నిబంధనలను మార్చేసింది. కొత్త నిబంధనలు తక్షణం అమలులోకి వస్తాయి. అవివాహితులకు రూమ్ లు ఇచ్చేది లేదని ఓయో గ్రూప్ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచే కొత్త నిబంధనలను అమలు చేయడం ఆరంభించింది. ఆన్ లైన్ లో రూమ్స్ బుక్ చేసుకున్నా.. ఈ నిబంధనలు పాటించాల్సిందే. కొత్త మార్గదర్శిక సూత్రాలు ఓయో గ్రూప్ హోటల్స్ అన్నింటికీ వర్తిస్తాయి. కొన్ని పౌర సంస్థల నుంచి అందిన ఫిర్యాదుల కారణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఓయో నార్త్ జోన్ రీజినల్ హెడ్ పవన్ శర్మ తెలిపారు. ఇది కొందరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినట్లు భావిస్తున్నా.. సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.