Monday, December 23, 2024

హీరోయిన్ అమలాపాల్ కు చేదు అనుభవం.. గుడిలోకి నో ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవి దర్శనానికి వెళ్లిన ఆమెను ఆలయం వెలుపలే అధికారులు అడ్డుకున్నారు. బయట నుంచే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని సూచించారు. ఈ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే అనుమతిస్తారని అధికారులు తెలిపారు. అమలాపాల్‌ క్రిస్టియన్‌ కావడంతో ఆమెను అడ్డుకున్నారు.

అమ్మవారి దర్శనం కాకపోయినప్పటికీ తాను ఎంతో సంతృప్తితో తిరిగి వెళ్తున్నట్టు నటి అమల తెలిపారు. ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో తనకు కలిగిన పరాభవాన్ని అమలాపాల్ పంచుకున్నారు. అన్యమతస్థురాలిని అని తనను ఆలయంలోకి అనుమతి ఇవ్వలేదని, అందుకు తీవ్ర నిరాశకు గురయ్యానని, అయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించానని, 2023లో కూడా ఈ మత వివక్ష కొనసాగడం విచారకరమని, త్వరలో ఈ మత వివక్షలో మార్పు వస్తుందని కోరుకుంటున్నా అంటూ రిజిస్టర్ లో రాసుకొచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News