Friday, December 27, 2024

నీట్‌పై ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి: ధర్మేంద్ర ప్రధాన్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: నీట్ పేపర్‌ను ఎన్‌టిఎ తీసుకొచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాలలో నీట్ పేపర్ లీకేజీపై చర్చ సందర్భంగా లోక్ సభలో ధర్మేంద్ర మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీపై సిబిఐ విచారణ జరుగుతోందని, నీట్ పరీక్షలపై వివరాలన్నీ సుప్రీంకోర్టుకు ఇచ్చామని తెలియజేశారు. నీట్‌పై ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ధర్మేంద్ర మండిపడ్డారు. గత ఏడు సంవత్సరాల నుంచి నీట్ పేపర్ లీకేజ్ అయినట్లు ఎక్కడ సాక్ష్యాలు లేవన్నారు. ఎన్‌టిఎ తీసుకొచ్చిన తరువాత 240 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామన్నారు.

నీట్‌పై అర్థవంతమైన చర్చ జరగాలని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పరస్పర ఆరోపణలతో సాధించేది ఏమీ ఉండదని, పరీక్షను మరింత పటిష్టవంతంగా నిర్వహించేలా ప్రయత్నం చేద్దామని స్పీకర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News