న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు షారూక్‌ఖాన్‌తో ఎన్‌సిబి డబ్బుల బేరాలకు దిగిందనే ఆరోపణలు నిరాధారమే అని విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడైంది. క్రూయిజ్ రేవ్‌పార్టీ కేసు నుంచి కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను బయటకు తీసుకువచ్చేందుకు షారూక్ యత్నించగా, ఈ దిశలో ఎన్‌సిబి అధికారులు కొందరు ఆయన నుంచి రూ.25 కోట్ల వరకూ డిమాండ్ చేసినట్లు క్రూయిజ్ ఘటన దశలో ప్రత్యక్ష సాక్షిగా మారిన ప్రభాకర్ సైల్ తమ అఫిడవిట్‌లో తెలిపారు. దీనిని తీవ్రంగా పరిగణించిన మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సిబి) డైరెక్టర్ జనరల్ ఎస్‌ఎన్ ప్రధాన్ దీనిపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు. అప్పట్లో ముంబై ఎన్‌సిబి దర్యాప్తు అధికారిగా ఉన్న వాంఖేడేపై ఎక్కువగా ఆరోపణలు వచ్చాయి. వీటిని ఆయన తోసిపుచ్చారు. కేసులో ప్రధాన సాక్షిగా నిలిచిన సైల్ ఎప్రిల్‌లో మృతి చెందారు. గుండెపోటుతోనే చనిపోయాడని అధికారులు తెలిపారు. కేసు మాఫీకి షారూక్ ఖాన్ నుంచి ఎన్‌సిబి దర్యాప్తు బృందాలు లంచాలు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలకు సరైన సాక్షాధారాలు లేవని విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు.
No evidence on NCB Talk with Shah Rukh Khan