Saturday, December 21, 2024

బ్రిజ్ భూషణ్ అరెస్టుకు ఆధారాల్లేవు: ఢిల్లీ పోలీసులు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, ఆయనను అరెస్టు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఢిల్లీ పోలీసులు బుధవారం తెలిపారు.

ఢిల్లీ పోలీసులు 15 రోజులలో కోర్టుకు తమ నివేదిక సమర్పిస్తారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో డబ్లుఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అరెస్టుకు తగిన ఆధారాలు లభించలేదని, మహిళా రెజ్లర్లు కూడా తమ ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించలేకపోయారని ఆ అధికారి చెప్పారు.

ఢిల్లీ పోలీసులు 15 రోజుల్లో తమ నివేదికను చార్జిషీట్ రూపంలో లేదా తుది నివేదిక రూపంలో కోర్టుకు సమర్పిస్తారని ఆయన చెప్పారు.
బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 22 నుంచి మహిళా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియచేస్తున్నారు.

పార్లమెంట్ భవనం వైపు ఊరేగింపుగా వెళ్లడానికి ప్రయత్నించిన రెజ్లర్లను జంతర్ మంతర్ నుంచి ఢిల్లీ పోలీసులు అదివారం తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News