Monday, December 23, 2024

హిజాబ్ ధరిస్తే ఎగ్జామ్ హాల్లోకి టీచర్లకూ అనుమతి లేదు!

- Advertisement -
- Advertisement -

Hijab

బెంగళూరు: హిజాబ్ వివాదం ప్రభావం ఇప్పుడు విద్యార్థుల నుంచి టీచర్లపై కూడా పడింది. పరీక్షలకు హాజరయ్యే టీచర్లు హిజాబ్ ధరించకూడదని, ఎవరైనా హిజాబ్ ధరిస్తే పరీక్ష హాలులోకి అనుమతి ఉండదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం కర్నాటక  రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది.  ఇకపోతే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (ఎస్ఎస్ఎల్‌సి) పరీక్ష ముగిసే వరకు విద్యార్థులకు తప్పనిసరిగా యూనిఫాం ఉండాలంటూ మార్చి 25న కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ ఆదేశా ప్రకారం.. విద్యా సంస్థల్లో విద్యార్థులకు యూనిఫాం తప్పనిసరి. ఇదే నిబంధన టీచర్లకు కూడా వర్తిస్తుంది. పదవ తరగతి పరీక్ష హాలులోకి హిజాబ్ ధరించిన టీచర్లకు అనుమతి లేదు. ఇది 12 తరగతి వరకు నిర్వహించే పరీక్షలకు కూడా వర్తిస్తుంది. హిజాబ్‌పై మేం టీచర్లను బలవంతం చేయడం లేదు. నచ్చనివాళ్లు పరీక్ష డ్యూటీని వదులుకుంటారు’ అన్నారు.

కర్నాటకలో ఎస్ఎస్ఎల్ సి పరీక్షలు జరుగుతున్నాయి, ఏప్రిల్ మధ్యలో ముగుస్తాయి. ఇంకా పియూసి రెండో సంవత్సరం పరీక్షలు ఈ నెలాఖరులో ప్రారంభమవుతాయి. గత వారం, మైసూరు జిల్లాలో ఎస్ఎస్ఎల్ సి  పరీక్ష ఇన్విజిలేషన్ పని పడ్డ ఉపాధ్యాయురాలు హిజాబ్ ధరింస్తానని  పట్టుబట్టడంతో ఆమెను విధుల నుండి రిలీవ్ చేశారు. ఎస్ఎస్ఎల్ సి,  పియూసి పరీక్షల డ్యూటీ కోసం ప్రభుత్వ మరియు ప్రభుత్వ-సహాయక పాఠశాలల ఉపాధ్యాయులను నియమించారు.
‘మేము ప్రీయూనివర్శిటీ  పరీక్షలకు ఇన్విజిలేటర్ల కొరతను ఎదుర్కొన్నట్లయితే,  హైస్కూల్ ఉపాధ్యాయులను పిలుస్తాము’ అని మైసూరులోని ప్రభుత్వ పియూ కళాశాల ప్రిన్సిపాల్ ఒకరు చెప్పారు.

బెంగుళూరు యూనివర్శిటీ మాజీ వైస్-ఛాన్సలర్ మరియు విద్యావేత్త ఎంఎస్ తిమ్మప్ప ప్రభుత్వ నిర్ణయం ‘తార్కికమైనది’ అని పేర్కొన్నారు. ఎందుకంటే విద్యార్థులు, ఉపాధ్యాయులకు భిన్నమైన పద్ధతి ఉండదు. ఒకే యూనిఫామ్ ను  రద్దు చేయడం ద్వారానే వివాదానికి పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు.
‘ఒకేరీతి భావన సమానత్వం యొక్క భావాన్ని తెస్తుందనే సందేహం నాకు ఉంది. ఇది సమానత్వం భావనను సృష్టించే మనస్తత్వం మరియు వైఖరి. యూనిఫాం దుస్తులను విడనాడడం రాడికల్‌గా అనిపించవచ్చు, కానీ అది ఇంకా ఉత్తమ పరిష్కారం’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News